
మిట్టమధ్యాహ్నం.. భానుడు నగరంలో తన ప్రతాపం చూపుతున్నాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఖైరతాబాద్ నుంచి లక్డీకాపూల్ వచ్చే దారిలో షాదన్ కాలేజీ సమీపంలో బుధవారం అభాగ్యుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ దారిన వెళ్లేవారు ఎవ్వరూ పట్టించుకోలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్ఐ ఎస్.హమీదుల్లా చలించిపోయాడు. అతడి వద్దకు పరుగెత్తి కొబ్బరి బొండాం నీళ్లు తాగించి సాంత్వన చేకూర్చాడు