
హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ భూముల లే-అవుట్ ప్లాట్ల ఈ వేలానికి కొనుగోలుదారుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం రెండు విడతలుగా వేలం వేయగా మొత్తం రూ. 202 కోట్ల ఆదాయం సమకూరింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మొదటి విడత వేలంలో 31,865 గజాలకు రూ. రూ.64.54 కోట్లు, మధ్యాహ్నం రెండో విడతలో 22,472 గజాలకు రూ. 138 కోట్లు వచ్చాయి. రెండు దశల్లో గజానికి కనిష్టంగా రూ. 57, 000, గరిష్టంగారూ. 73,900 ధర పలికింది. సాయంత్రం వరకు వేలం ప్రక్రియ కొనసాగింది. ఈ వేలం సోమవారం కూడా జరుగనుందని హెచ్‌ఎండీఏ తెలిపింది.