ఆన్​లైన్​లో ఈ-పాన్‌‌ కార్డు  

ఆన్​లైన్​లో ఈ-పాన్‌‌ కార్డు  

బిజినెస్ డెస్క్, వెలుగు: గవర్నమెంటు ఆఫీసు నుండి ఏదైనా డాక్యుమెంటును సంపాదించాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. అదే ఆన్‌‌లైన్‌‌లో అయితే చాలా ఈజీ. పాన్ కార్డ్‌‌తో సహా అనేక డాక్యుమెంట్‌‌ల కోసం మీరు ఆన్‌‌లైన్‌‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.  పాన్‌‌ కార్డు వెరిఫికేషన్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో కూడా చేయవచ్చు. ఇందుకోసం https://www.incometax.gov.in/iec/foportal/ లింకుకు వెళ్లాలి.  హోమ్‌‌పేజీలో ‘వెరిఫై యువర్‌‌ పాన్‌‌’ అనే ట్యాబ్‌‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్  పేరు వంటి వివరాలను ఇవ్వాలి.   ఆధార్ కార్డుతో   మొబైల్ నంబర్ లింక్ చేసుకున్న వారు ఇన్‌‌స్టంట్‌‌ పాన్ లేదా ఈ–-పాన్‌‌ను 10 నిమిషాలలోపు ఈ వెబ్‌‌సైట్ ద్వారా పొందవచ్చు. . 
ఈ-పాన్ కోసం ఇలా అప్లై చేయాలి :
స్టెప్ 1: మీకు నచ్చిన ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్‌‌ని ఓపెన్‌‌ చేసి https://www.incometax.gov.in/iec/foportal/ లింకుకు వెళ్లండి.
స్టెప్ 2: హోమ్‌‌పేజీలో మీరు ఈ–పాన్‌‌ కోసం దరఖాస్తు చేయడానికి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: ఇక్కడి నుంచి మరో విండోకు డైరెక్ట్ అవుతుంది. దీనిలోని 'గెట్‌‌ న్యూ ఈ–పాన్‌‌' అనే   హైపర్‌‌లింక్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్  పుట్టిన తేదీని ఇవ్వాలని అడుగుతుంది. మీ వివరాలను వెరిఫే చేయడానికి మన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
 ఈ-పాన్ స్టేటస్‌‌ను చూడటం ఇలా:
స్టెప్ 1: వెబ్‌‌సైట్ హోమ్‌‌పేజీకి వెళ్లి, ఈ–-పాన్‌‌కు సంబంధించిన ట్యాబ్‌‌పై క్లిక్ చేయండి
స్టెప్ 2: ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు 'చెక్ స్టేటస్ /డౌన్‌‌లోడ్‌‌ పాన్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి
స్టెప్ 3: కొత్త పేజీలో మీ ఆధార్ నంబర్ ఇవ్వాలని అడుగుతారు. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్‌‌ నంబరుకు వచ్చిన ఓటీపీనిఎంటర్ చేస్తే పాన్‌‌కార్డు స్టేటస్  తెలుస్తుంది
స్టెప్ 4: మీ ఈ–పాన్‌‌కార్డు రెడీగా ఉంటే వెంటనే డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు