V6 News

ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనికి సంబంధించిన ముఖ్య తేదీలను JNTU అధికారులు ప్రకటించారు. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుం SC,ST విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.. మే నెల 3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ. అదేవిధంగా 8,9వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షల నిర్వహణ జరగనుంది.