ఇయర్ ఫోన్స్ తో కేన్సర్?

ఇయర్ ఫోన్స్ తో కేన్సర్?

‘‘వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ లేదా ఎయిర్ పాడ్స్ తో ఆరోగ్యానికి హాని చేస్తాయి. 40 దేశాలకు చెందిన 200 సైంటిస్టులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు ” అంటూ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న స్టోరీ కరెక్టు కాదు. సైంటిస్టులెవరూ ఎయిర్ పాడ్స్ వాడటం డేంజరని చెప్పలేదు.  2015లో ప్రభుత్వాలకు చిన్న విన్నపం పెట్టారు. వైర్ లెస్ డివైజ్ల ద్వారా విడుదలయ్యే నాన్ ఐయోనైజింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల ఆరోగ్య సమస్యలు రావొచ్చని చెప్పారు.

ఎలుకలకు కేన్సర్

సెల్ ఫోన్ల ద్వారా నాన్ ఐయోనైజింగ్ రేడియేషన్ విడుదలవుతుంది. బ్లూ టూత్, వైర్ లెస్ డివైజ్ లు(వైఫై) వల్ల కూడా వస్తుంది. దీని వల్ల ఎలుకలకు కేన్సర్ వస్తుందని సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది. అయితే మనుషులకు జబ్బు వస్తుందా అన్న విషయంపై ఇంకా రీసెర్చ్ లు జరుగుతున్నాయి.