లడ్డాఖ్ లో భూకంపం..ఢిల్లీకి పొంచి ఉన్న ప్రమాదం?..అప్రమత్తమైన అధికారులు

లడ్డాఖ్ లో భూకంపం..ఢిల్లీకి పొంచి ఉన్న ప్రమాదం?..అప్రమత్తమైన అధికారులు

కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్ ను భూకంపం వణికించింది. సోమవారం ( జనవరి 19) ఉదయం  లడ్డాఖ్ లోని లేహ్  ప్రాంతంలో  భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.9 తీవ్రతగా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. 

సోమవారం ఉదయం 11.15 గంటలకు భూ ఉపరితలం కింద 171కి.మీల లోతులో భూకంపం  కేంద్రంగా భూప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది.  అంతకుముందు ఢిల్లీలో కూడా 2.8 తీవ్రతతో భూమి కంపించినట్లుతెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాలయ బెల్ట్ వెంబడి లేహ్, లడ్డాఖ్ ప్రాంతంలో మరోసారి భూకంపాలకు ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఎమర్జెన్సీ రెస్య్కూ టీం ను హై అలెర్ట్ చేశారు. 

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీకి భూకంపాల ప్రమాదం పొంచి ఉందని , దేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతాల జోన్ IV లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీ ఎన్ సీఆర్ లో అనేక భూప్రకంపనలు సంభవించాయి.  రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రత నమోదు అయింది. 2022లో ఢిల్లీ దాని పొరుగు రాష్ట్రమైన హర్యానాలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు.