చైనాను వణికించిన భూకంపం.. ఇళ్లలో నుంచి జనం పరుగులు..

చైనాను వణికించిన భూకంపం.. ఇళ్లలో నుంచి జనం పరుగులు..

చైనాను భూకంపం వణికించింది.. శుక్రవారం ( మే 16 ) ఉదయం 6:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.6గా తీవ్రత నమోదయ్యింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు సమాచారం. భూ ప్రకంపనలు రాగానే భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు జనం. అయితే.. ఎలాంటి ఆస్థి నష్టం, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం వచ్చిన ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్ వంటి పలు ప్రాంతాల్లో తరచూ భూకంపాలు వస్తూనే ఉంటాయి. టర్కీలో భూకంపం వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే చైనాలో కూడా భూమి కంపించింది.

ఇదిలా ఉండగా.. గురువారం ( మే 15 ) టర్కీలో భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం టర్కీని వణికించింది... టర్కీలోని కోన్యాలో భూప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. 5.2 తీవ్రతతో భూకంపం  రావడంతో పలు ప్రాంతాల్లో బిల్డింగ్ లు నేలమట్టం అయ్యాయి. టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్సులో ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ భూకంపం ఎఫెక్ట్ అంకారా, ఇస్తాంబుల్ తో పాటు ఇతర ప్రాంతాలపై కూడా పడింది...ఇస్తాంబుల్‌ సిటీలోని పలు ప్రాంతాల్లో భూకంపం ధాటికి.. జనాలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపంలో అనేక మంది గాయపడగా... ఆస్థి నష్టం, ప్రాణనష్టం గురించి అధికారికంగా వివరాలు వెల్లడి కాలేదు.