హుజురాబాద్‎లో మంత్రులే లిక్కర్ పంచుతున్నారు

V6 Velugu Posted on Sep 23, 2021

హుజురాబాద్‎లో టీఆర్ఎస్ పైసల రాజకీయం చేస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆ పార్టీ వాళ్లు సొంత పార్టీ వాళ్లనే కొనుక్కుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హుజురాబాద్‎లోని మధవాణి గార్డెన్స్‎లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ప్రతిపక్షాల వాళ్లను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. మంత్రులే లిక్కర్ లోడ్ తీసుకొచ్చి పంచుతున్నారు. కులాల వారీగా డబ్బులు పంచుతున్నారు. కుల సంఘాల పేరుతో రాజకీయం చేస్తున్నారు. కుల సంఘాలకు గుడులు కట్టిస్తామంటూ లోబరచుకుంటున్నారు. కుల సంఘాల మీద ప్రేమతో డబ్బులు ఇస్తామనడంలేదు. ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారు. దళితుల మీద ప్రేముంటే.. ఏడున్నరేండ్లతో ఒక్క పథకం కూడా ఎందుకు తీసుకురాలేదు. కేసీఆర్ ఇప్పటికీ జైభీమ్ అని ఎందుకు అనడం లేదు. దళితబంధు కేవలం హుజురాబాద్‎లోనే కాకుండా.. రాష్ట్రమంతా ఇవ్వాలి. మీకు ఏవేవో ఇస్తామని చెప్పి.. ఈటల రాజేందర్‎ను బొంద పెట్టాలని చూస్తున్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మీరిచ్చిన హామీలెన్నో అమలు కావడంలేదు. అవన్నీ అమలుచేయాలి. ధనిక రాష్ట్రమని చెబుతున్నారు కదా.. మరి పెన్షన్లు, నిరుద్యోగ భృతి, చివరికి ఆరోగ్య శ్రీ డబ్బులు కూడా ఎందుకు విడుదలచేయడం లేదు’ అని ఈటల ప్రశ్నించారు.

For More News..

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..

ఎమ్మెస్సీ చదివి స్వీపర్ పని.. కేటీఆర్ స్పందన

Tagged Telangana, CM KCR, ELECTIONS, Eatala Rajender, Huzurabad, Huzurabad By election

Latest Videos

Subscribe Now

More News