పబ్లిక్ మీటింగ్స్‌కు ఎన్నికల కమిషన్ అనుమతి

పబ్లిక్ మీటింగ్స్‌కు ఎన్నికల కమిషన్ అనుమతి

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పబ్లిక్ మీటింగ్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల కమిషన్‌ పబ్లిక్ మీటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కేసులు తగ్గడం, మరోవైపు ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో బహిరంగ సమావేశాలకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులు మాత్రం విధించింది. ఇండోర్/అవుట్‌డోర్ సమావేశాలు/ర్యాలీలకు హాజరయ్యే వ్యక్తుల సంఖ్య ఇండోర్ హాళ్ల సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం మరియు 30 శాతానికి పరిమితం చేయబడాలనే షరతుకు లోబడి అవుట్‌డోర్ మీటింగ్/ఇండోర్ మీటింగ్‌లు/ర్యాలీలకు సంబంధించిన పరిమితులు మరింత సడలించింది ఎన్నికల కమిషన్.

అయితే రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్/బైక్/వాహనాల ర్యాలీలు మరియు ఊరేగింపులపై నిషేధం ముందులాగానే ఉంటుందన్నారు. ఇంటింటికీ ప్రచారం కోసం అనుమతించబడిన గరిష్ట సంఖ్యలో వ్యక్తుల సంఖ్య 20గా నిర్ణయించబడింది. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్య ప్రచారంపై నిషేధం కూడా మునుపటిలానే కొనసాగుతుందని ఈసీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి ఎన్నికల సంఘం శనివారం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో పోలింగ్ జరగనున్న రాష్ట్రా్లో కూడా తక్కువగా నమోదు అవుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కమిషన్‌కు తెలియజేసింది. అయితే బహిరంగ సమావేశాలు.. నిర్వహించే ప్రాంతాల్లో ఎంతమంది హాజరు అవ్వాలి? ఏంటి అన్న వివరాలు మాత్రం జిల్లా యంత్రాగమే నిర్ణయిస్తుందని రాజకీయా పార్టీలకు ఈసీ తెలిపింది. ఈనెల దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం నెలకొంది. 

దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం నెలకొంది. యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10,14,20,23,27 మార్చి 3 ఏడు తేదీల్లో ఒటింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్, గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్‌లో ఫిబ్రవరి 27 మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక మార్చి 10 ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. 

ఇవి కూడా చదవండి: 

మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పితృవియోగం

రేపు పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం