మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పితృవియోగం

మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పితృవియోగం

లఖ్నవూ: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పితృవియోగం కలిగింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా ఇవాళ తుదిశ్వాస విడిచారు. రైనా తండ్రి సొంతూరు జ‌మ్ముక‌శ్మీర్‌. 1990లో త్రిలోక్‌చంద్ ఆ ఊరిని వ‌దిలి ఉత్తర్ ప్రదేశ్ లోని మురాద్‌న‌గ‌ర్ టౌన్‌ కు వచ్చి స్థిర‌ప‌డ్డారు. త్రిలోక్‌చంద్‌కు ఇద్ద‌రు కొడుకులు, ఇద్ద‌రు కూతుళ్లు. వాళ్ల‌లో సురేశ్ రైనా చిన్న‌కొడుకు.  ఘ‌జియాబాద్‌లో ఉన్న త‌న ఇంట్లో త్రిలోక్ చంద్ రైనా తుదిశ్వాస విడిచిన‌ట్టు సురేశ్ రైనా వెల్లడించారు.
సురేష్ రైనాకు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఎంతో మక్కువ. స్థానిక పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరచి 1998లో గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో సీటు సంపాదించాడు. అంచెలంచెలుగా రంజీ, దేశవాళీ పోటీల్లో రాణించి టీమిండియాకు ఎంపికయ్యాడు. టీ20ల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సురేష్ రైనా అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి 2020లో త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.
తన బాల్యంలో కాశ్మీర్ ను వదిలి ఉత్తర్ ప్రదేశ్ కు ఎందుకు వలసవచ్చామో తెలియకుండా తన తండ్రి జాగ్రత్తలు తీసుకున్నాడని సురేష్ రైనా గుర్తు చేసుకున్నారు. గత సీజన్ వరకు టీ20ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన సురేష్ రైనా వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సురేష్ రైనా ‘చిన్న తలైవా’గా గుర్తింపు పొందాడు. 

 

ఇవి కూడా చదవండి...

రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి

సంగీత ప్రపంచానికి ఆమె లేని లోటు తీర్చలేనిది: ఏఆర్ రెహ్మాన్

లతాజీ మరణంతో పాట మూగ బోయింది

ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన మెగాస్టార్