
ఇండియన్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి ఆస్కార్ విన్నర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు మనందరికీ చాలా విచారకరమైన రోజని అన్నారు. లతాజీ లాంటి వారు కేవలం ఒక ఐకాన్ మాత్రమే కాదని, భారతీయ సంగీత ప్రపంచంలో ఒక భాగమని రెహ్మాన్ అన్నారు. తాను ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే లతా దీదీ ఫొటోనే చూస్తుంటానని, ఆమె మొఖం చూడడం ద్వారా ఎంతో స్ఫూర్తి పొందుతుంటానని చెప్పారు. ఆమె పాడిన కొన్ని పాటలను రికార్డ్ చేయడంతో పాటు కలిసి పాడే అవకాశం కూడా తనకు దక్కడం ఎంతో అదృష్టమని అన్నారు. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని, ఒక శూన్యం అలా మిగిలిపోతుందని రెహ్మాన్ చెప్పారు.
It's a sad day for us. Somebody like Lata Ji isn't just an icon, she's a part of India's music &poetry; this void will remain forever. I used to wake up to a picture of Lata Didi's face & get inspired; was lucky to record a few songs &sing along with her: Music composer AR Rahman pic.twitter.com/9RDYkaSCzg
— ANI (@ANI) February 6, 2022
గత నెల 8న కరోనా బారినపడిన లతా మంగేష్కర్ (92) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. దాదాపుగా నెల రోజుల పాటు కరోనాతో పోరాడిన ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని ఇటీవల డాక్టర్లు ప్రకటించినా.. ఉన్నట్టుండి నిన్న మధ్యాహ్నం నుంచి పరిస్థితి విషమించింది. ఆమెను ప్రాణాలను నిలపాలని డాక్టర్లు ఎంత ప్రయత్నించినా చివరికి ఫలితం లేకపోయింది. లతా మంగేష్కర్ కు ముగ్గురు సోదరీమణులు ఉషా మంగేష్కర్, ఆశా భోంస్లే, మీనా ఖాదికర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు. 1928 సెప్టెంబర్ 28న ఇండోర్లో జన్మించారామె.
గానకోకిల గురించి మరింతగా..
- లతా 1942లో 13 ఏళ్ల వయసులో తొలి పాట పాడింది.
- 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
- 2001లో భారతరత్న ఆమె సొంతం.
- పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్నారు.
- ఇప్పటివరకు 980 సినిమాలకు పాటలు పాడారు.
- వివిధ భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడారు.
- 36కి పైగా భారతీయ మరియు విదేశీ భాషలలో పాటలు పాడారు.
- తెలుగులో మూడు పాటలు మాత్రమే పాడిన లత.
- 1947లో మాజ్ బూర్ చిత్రంతో గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టారు.
- భారత గానకోకిలగా లతకు గుర్తింపు.
- తెలుగులో 1995లో నాగేశ్వరావు నటించిన సంతానం సినిమాలో నిదుర పోరా తమ్ముడా పాట.
- 1965లో ఎన్టీఆర్ నటించిన దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట.
- 1988లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీరకు పాట.
- లతా మంగేష్కర్ రాజ్యసభ ఎంపీగాను పనిచేశారు. (నవంబర్ 22, 1999 నుంచి నవంబర్ 21, 2005 వరకు)
- లత 13 ఏళ్ల వయసులోనే ఆమె తండ్రి గుండె వ్యాధితో మరణించారు.
- గురువు అమాన్ అలీఖాన్ వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు.
- గాయనిగా 7 దశాబ్దాలకు పైగా కొనసాగారు.
- 170 మంది సంగీత దర్శకుల వద్ద పాటలు పాడిన ఘనత ఆమెకే దక్కింది.
- ఛత్రపతి శివాజీ, అనార్కలీ సినిమాలతో మంచి గుర్తింపు.