ఇది యాపారం : PVRలో సినిమా టికెట్ల కంటే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ లాభాలే ఎక్కువ..!

ఇది యాపారం : PVRలో సినిమా టికెట్ల కంటే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ లాభాలే ఎక్కువ..!

పీవీఆర్ సినిమాస్..ఎంటర్ టైన్ మెంట్ ధియేటర్లు..అందరం ఇలానే అనుకుంటారు..కానీ వాళ్లు చేసే వ్యాపారం మాత్రం సినిమాలపై కాదు..పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ పైనే.. అవును..ఎందుకంటే సినిమా టికెట్లు అమ్మటం వల్ల..సినిమాల వల్ల వాళ్లకు వస్తున్న ఆదాయం కంటే..పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ పై వచ్చే ఆదాయం వందల కోట్లు..ఏంటీ అవాక్కయ్యారా.. అవ్వరా ఏంటీ..బయట 50 రూపాయల పాప్ కార్న్.. పీవీఆర్ లో 450 రూపాయలు అమ్ముతారు..బయట 20 రూపాయల కూల్ డ్రింక్.. పీవీ ఆర్ పై 200 రూపాయలు అమ్ముతారు..ఈ మాత్రం ధరల దోపిడీ ఉంటే.. అన్ని వందల కోట్ల ఆదాయం రాకుండా ఉంటుందా ఏంటీ... ఈ మేటర్ పూర్తి వివరాల్లోకి వెళితే..

సినిమా థియేటర్లలో పాప్‌కార్న్,పెప్సీ లతో మీ జేబులకు చిల్లులు పెడుతున్నారం అంటే నిజమే అనిపిస్తోంది. ఇవి సినిమా టికెట్ల కంటే ఎక్కువ ఖరీదైనవిగా మారాయి అనడానికి పీవీఆర్ ఐనాక్స్ గత ఆర్థిక సంవత్సరం గణాంకాలే నిదర్శనం. కేవలం ఫుడ్స్, డ్రింక్స్ వ్యాపారంతోనే పీవీఆర్ అధిక ఆదాయం పొందిందట.. ఇది సినిమా టికెట్ల కంటే ఎక్కువ. 

సినిమాలపై పాప్‌కార్నా?

బాక్స్ ఆఫీస్ టిక్కెట్ల విక్రయాల కంటే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందిందట. గత ఆర్థిక సంవత్సరంలో సినిమా టిక్కెట్ల విక్రయాలు 19శాతం పెరిగితే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ద్వారా 21 శాతం ఆదాయం పెరిగిందట. గత ఏడాది టికెట్లకు రూ.1,618 కోట్ల ఆదాయం వస్తే..పాప్ కార్న్,కూల్ డ్రింక్స్ ద్వారా రూ.1,958 కోట్లు వచ్చాయి. 2022-2023లో సినిమా టిక్కెట్ ఆదాయం రూ.3వేల 279.9 కోట్లు, రూ.2వేల 751కోట్లు. ఈ లెక్కన పాప్ కార్న్, కూల్ డ్రింక్స్  ద్వారా 21 శాతం పెరిగిందట. 

సినిమాహాళ్లలో ఫుడ్స్ అండ్ డ్రింక్స్ ధరల గురించి తరుచుగా ప్రేక్షకులు ఫిర్యాదు చేస్తుండటం తెలిసిందే. ఇటీవల ఓ ప్రేక్షకుడు పీవీఆర్ సినిమా హాళ్లో ఫుడ్స్,  డ్రింక్స్ గురించి స్పందిస్తూ... మొత్తం నెల ఓటిటి  సభ్యత్వం కంటే పాప్ కార్న్ చాలా ఖరీదైనది  అని రాసిన ట్వీట్ వైరల్ గా మారింది. పీవీఆర్ దాని యాజమాన్యం కోసం ఇదో రకమైన లాభదాయక వ్యాపారం అని రాశాడు. పీవీఆర్ లో ప్రతిదీ చాలా ముఖ్యమైనది.. దానిని మేం గౌరవించాలని కోరుకుంటాం అని వ్యంగ్యంగా రాశారు. 

అయితే పీవీఆర్ ఫుడ్, డ్రింక్స్ వ్యాపారంపై స్పందించిన యాజమాన్యం..పీవీఆర్ మాల్ కేవలం ఒక సినిమాలకోసమే కాదు.. ఇది ఫుడ్ వ్యాపారం కోసం అని మెట్రోలకు అనుంసంధానం చేయడం వల్ల ఇతరులు కూడా వస్తుంటారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ అమ్ముడవుతుంటాయి. అందుకే గత ఆర్థిక సంవత్సర ఆదాయంలో అధిక వృద్ధిని సాధించిందని చెప్పుకొచ్చారు. 

ఏదీ ఏమైనా 50..100 ఉండాల్సిన పాప్ కార్న్ 450 రూపాయలుండటం మరీ దోచుకోవడం కాదా అని ప్రశ్నిస్తున్నారు కస్టమర్లు, నెటిజన్లు.