రేపు పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

రేపు పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

భారతరత్న, గాన కోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల యావత్ భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం రేపు (ఫిబ్రవరి 7) ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కూడా హాఫ్ డే హాలిడే ప్రకటించింది. గాయని లతా మంగేష్కర్ గౌరవార్థం పశ్చిమ బెంగాల్ సర్కార్ రేపు (ఫిబ్రవరి 7) హాఫ్ డే సెలవు పాటించనుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మరోవైపు ముంబైలో లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. 

ఇప్పటికే ముంబైలో లతా నివాసానికి ప్రముఖులు క్యూ కట్టారు. లతాజీ భౌతిక గాయానికి నివాళులర్పిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లతాజీని కడసారి చూసేందుకు ఆమెనివాసానికి వెళ్లారు. ఆమె భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, జావెద్ అక్తర్, హీరోయిన్ శ్రద్ధ కపూర్.. లతాజీకి ఆమె నివాసంలో  ఘన నివాళులర్పించారు. మరోవైపు మోడీ కూడా ముంబై వెళ్లనున్నారు. లతా అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.