హైదరాబాద్ ఈసీఐఎల్లో టీచింగ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే..

హైదరాబాద్ ఈసీఐఎల్లో టీచింగ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే..

హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా(ఈసీఐఎల్) టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 20.

  • పోస్టులు: బాల వాటిక టీచర్, పీఆర్టీ, టీజీటీ.
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిప్లొమా, బి.ఈఎల్.ఈడీతోపాటు సీటెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బోధన అనుభవం తప్పనిసరి.
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.. చిరునామా.. సెక్యూరిటీ ఆఫీస్, ఎంట్రెన్స్ ఆఫ్ డీఏఈ కాలనీ, డి–సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్, 500062.
  • అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 10.
  • లాస్ట్ డేట్: జూన్ 20.
  • సెలెక్షన్ ప్రాసెస్: స్కిల్ టెస్ట్, టీచింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ecil.co.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.