ఏపీ మైనింగ్‌ స్కాం కేసులో ఈడీ దూకుడు.. ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల్లో సోదాలు

ఏపీ మైనింగ్‌ స్కాం కేసులో ఈడీ దూకుడు.. ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల్లో సోదాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన మైనింగ్‌ స్కాంపై ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం (మే 27) ఏకకాలంలో హైదరాబాద్‌, విజయవాడ, జైపూర్‌, కోయంబత్తూరులలో ఈడీ సోదాలు నిర్వహించింది. 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, మైనింగ్ లీజుల్లో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏపీ మైనింగ్‌ స్కాంలో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే బుధవారం (మే 27) మాజీ మైన్స్‌ డైరెక్టర్‌ VG వెంకటరెడ్డిపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. 

హైదరాబాద్‌లోని JPVL, GCKC ప్రాజెక్ట్స్‌, ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌లలో తనిఖీలు నిర్వహించారు. అలాగే, కోయంబత్తూరులో 2 చోట్ల, జైపూర్‌లో 2 చోట్ల రైడ్స్ చేశారు. వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రూ.2500 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.