తిరుమలకు పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 24 గంటలు..

తిరుమలకు  పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 24 గంటలు..

 తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రెండవ శనివారం, ఆదివారం సెలువు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోగా పాచికల్వ గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.


తిరుమల గిరులు గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి.  అలిపిరి నుంచి అన్ని ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.  వరుస సెలవుల కారణంగా శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి పొటెత్తారు.  భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

వీకెండ్ .. వరుస సెలవులు కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట రింగ్ రోడ్డు దాటి పాచికాల్వ గంగమ్మ గుడి  వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరి ఉన్నారు.  ఉచిత సర్వదర్శనానికి 24 గంటలు, SSD టోకన్ భక్తులకు 10 గంటలు, రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. 

►ALSO READ | శ్రీవారి భక్తులకు అలర్ట్: అక్టోబర్ నెల దర్శన కోటాపై టీటీడీ కీలక అప్ డేట్...

 శనివారం ( 2026 జులై 11)  తిరుమల శ్రీవారిని 92 వేల 17 మంది భక్తులు దర్శించుకున్నారు. 47 వేల 949 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 93 లక్షలు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు. అలాగే 4 లక్షల 63 వేల తిరుమల లడ్డూలను భక్తులు కొనుగోలు చేయగా, 3 లక్షల 23 వేల మంది అన్న ప్రసాదాలు స్వీకరించినట్లు టీటీడీ తెలిపింది