విశాఖలో భూప్రకంపనలు...భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం...

విశాఖలో భూప్రకంపనలు...భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం...

విశాఖలో భూకంపం సంభవించింది. ఆదివారం ( జులై 12 ) తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, పెద్దవాల్తేరు, మాధవధార, సీతమ్మధారలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్ బీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంప తీవ్రత 4.5గా నమోదయ్యింది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఉదయం 5.08 గంటలకు భూమి కంపించిందని తెలిపారు స్థానికులు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో విశాఖపట్నం మొత్తం కొద్దిసేపు భయాందోళనకు లోనయ్యామని అంటున్నారు స్థానికులు.