ఇవాళ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

ఇవాళ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల బీఈడీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఎడ్ సెట్ ఎగ్జామ్​ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో  మధ్యాహ్నం 3.30 గంటలకు కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, మహాత్మాగాంధీ వర్సిటీ ఇన్ చార్జ్ వీసీ నవీన్ మిట్టల్ రిజల్ట్స్ ను రిలీజ్ చేయనున్నట్టు ఎడ్ సెట్ కన్వీనర్ మృణాళిని తెలిపారు. మే 23న ఎడ్ సెట్ ఎగ్జామ్ జరగ్గా.. 33,879 మందికి గాను 29,463 మంది అటెండ్ అయ్యారు.