లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఈడీ ఆఫీసర్​

లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఈడీ ఆఫీసర్​

 న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఈడీ అసిస్టెంట్​ డైరెక్టర్ ను గురువారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈడీ అధికారులు ఆగస్టు 3, 4 తేదీల్లో నగల వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో నగల వ్యాపారి కొడుకుకు అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్ ఫోన్​ చేసి రూ.25 లక్షలు ఇవ్వాలని, లేకుంటే అరెస్ట్​ చేస్తామని బెదిరించాడు. 

చివరకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి కొడుకు ఒప్పుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని వ్యాపారి కొడుకు సీబీఐని ఆశ్రయించాడు. ఈ క్రమంలో వ్యాపారి కొడుకు నుంచి సందీప్​ సింగ్​ యాదవ్​ లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.