కవిత అరెస్ట్‪కు అన్నీ తీసుకొచ్చాం కేటీఆర్‪పై ఈడీ ఆఫీసర్ సీరియస్

కవిత అరెస్ట్‪కు అన్నీ తీసుకొచ్చాం  కేటీఆర్‪పై ఈడీ ఆఫీసర్  సీరియస్

కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ పార్టీ, జాగృతి నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న కొద్ది సేపటికే  బీఆర్ఎస్ నేతల, కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావులు ఇంట్లోకి వెళ్లి కవిత అరెస్ట్ చట్టవిరుద్ధమని ఈడీ ఆఫీసర్లతో వాదించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. దీంతో కేటీఆర్, ఈడీ, ఐడీ జాయింట్ డైరెక్టర్ మీనా భాను ప్రియ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కవిత అరెస్ట్ విషయాన్ని ఆమె భర్త అనిల్ కు సమాచారం ఇచ్చామని ఈడీ అధికారులు తెలిపారు.

బీఆర్ఎస్ నేతలపై ED ఆఫీసర్ మీనా భాను ప్రియ సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండానే, సొదాలు జరుగున్న సమయంలో ఇంట్లోకి చొచ్చుకు వచ్చారని అగ్రహం వ్యక్తం చేశారు.  బలవంతంగా లోనికి వచ్చారని కేటీఆర్ పై ఆమె సీరియస్ అయ్యారు. లీగల్ గా అన్నీ డాక్యుమెంట్స్ తీసుకొనే వచ్చామని ఈడీ ఆఫీసర్ చెప్పారు.