పినరయి కుమార్తెకు ఈడీ సమన్లు...జూన్ 12న విచారణకు రమ్మంటూ పిలుపు

పినరయి కుమార్తెకు ఈడీ సమన్లు...జూన్ 12న విచారణకు రమ్మంటూ పిలుపు

కొచ్చి: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌‌‌‌‌‌‌‌కు ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఇసుక మైనింగ్ సంస్థ ‘కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్’ (సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్) ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది. జూన్ 12న కొచ్చిలోని తమ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. 

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌‌‌‌‌‌‌‌ఏ) కింద అధికారులు ఆమె స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను రికార్డు చేయనున్నారు. సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ సంస్థ ఆర్థిక లావాదేవీలలో జరిగిన అక్రమాలు, ప్రస్తుతం మూతపడిన వీణా విజయన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఐటీ సంస్థతో జరిపిన లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది.

ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఓ నమోదు చేసిన ఫిర్యాదుతో ఈడీ కేసు

‘ఐటీ కన్సల్టెన్సీ సేవల’ పేరిట సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎల్ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌కు రూ. 2.78 కోట్ల మేర మోసపూరిత చెల్లింపులు చేసిందనేది ప్రధాన ఆరోపణ. దీనికి తోడు, సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ ఎండీ శశిధరన్ కర్తాకు చెందిన ‘ఎంపవర్ ఇండియా క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే మరో సంస్థ కూడా ఎక్సాలాజిక్​కు రూ.50 లక్షల మేర అదనపు రుణాలు మంజూరు చేసింది. పాత బకాయిలు సకాలంలో చెల్లించనప్పటికీ ఈ రుణం ఇవ్వడం గమనార్హం. 

ఈ మొత్తం వ్యవహారంలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎల్ యాజమాన్యం, వీణ కలిసి నేరపూరితంగా ఆదాయాన్ని ఆర్జించారని భావిస్తున్న ఈడీ.. ఈ లావాదేవీల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడానికి సిద్ధమైంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా గతేడాది మార్చిలో ఈడీ కేసును నమోదు చేసింది.