ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. 

గతంలో రెండు సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజులు విచారించిన ఈడీ తీరుపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే,ఈడీ కవితను  అరెస్టు చేయకుండా.. నిర్దోషి అని తేల్చకుండా అప్పటికి వదిలేశారు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఆప్ నేత మనీష్ సిషోడియా అరెస్టై జైల్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది.