పండగే పండగ:దసరా సెలవులు ఇచ్చింది13 రోజులే.. వచ్చింది మాత్రం 15 రోజులు

పండగే పండగ:దసరా సెలవులు ఇచ్చింది13 రోజులే.. వచ్చింది మాత్రం 15 రోజులు

హైదరాబాద్: తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది రాష్ట్రప్రభుత్వం..రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 13రోజుల దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం.. బతుకమ్మ పండుగతో ప్రారంభమయ్యి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు మొత్తం13 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. 

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు అక్టోబర్4న తిరిగి స్కూళ్లను తెరవనున్నారు. అయితే 5 తేదీ ఆదివారం కావడంతో ఆరోతేదీన స్కూళ్లను తెరిచే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈసారి ఈ సెలవుల మధ్యలోనే అక్టోబర్‌ 2న గాంధీ జయంతి కూడా ఉంది. ఇది సాధారణంగా ప్రభుత్వ సెలవుదినం. కానీ ఈసారి దసరా సెలవుల్లో ఇది కలిసిపోయింది.