టెన్త్ ఎగ్జామ్స్కి ఏర్పాట్లు పూర్తి

టెన్త్ ఎగ్జామ్స్కి ఏర్పాట్లు పూర్తి

రంగారెడ్డి: జూన్ 1 నుంచి బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కలెక్టరేట్ లో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెల పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో... అందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని 9300 పాఠశాలల్లో ఫర్నిచర్, ఫ్యాన్స్, లైట్స్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖలకు ఈ పనులు అప్పగించామని, 15 రోజుల్లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇక జూన్ రెండో వారం వరకు ప్రతి ఒక్కరికి పాఠ్య పుస్తకాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా టీచర్, పేరెంట్స్ మీటింగ్ నిర్వహించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 23 నుంచి ఆరంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా ఆయా పంచాయతీలు, మునిసిపాలిటీ సిబ్బంది ఎక్జామ్ సెంటర్ల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ఇంటర్ పరీక్షల్లో కొన్ని పొరపాట్లు జరిగాయి

కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలె