
హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల్లో చిన్న చిన్న పొరబాట్లు జరిగాయన్నారు బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్. కొన్ని ప్రింటింగ్ మిస్టెక్స్ జరిగాయని చెప్పారు. వచ్చే ఏడాది తప్పులు జరక్కుండా చూసుకుంటామన్నారు. పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు జలీల్. మొత్తం 9లక్షల మంది పరీక్షలు రాశారని తెలిపారు. నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామన్నారు. స్పాట్ వాల్యూయేషన్ లో 15వేల మంది లెక్చరర్లు పాల్గొంటారని చెప్పారు. నిర్మల్, సిద్ధిపేట, మంచిర్యాలలో కొత్తగా వాల్యూయేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టో ల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు జలీల్.
మరిన్ని వార్తల కోసం..