రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెరుగుతాయి

 రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెరుగుతాయి
  •  విద్యా ప్రమాణాలు పెరుగుతాయి
  • ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారుస్తాం

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పెరుగుతాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం హైదరాబాద్ లో 682 ప్రభుత్వ స్కూల్స్ పై రివ్యూ చేశామని తెలిపిన తలసాని..ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చడంపై చర్చించామన్నారు. కేబినెట్ లో మన ఊరు మన బడి మన ఊరు మన బస్తి అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చామని..ప్రభుత్వ స్కూల్ లో చదివిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ లు అయ్యారన్నారు. తెలుగు, ఉర్దూతో పాటు.. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ లు నిర్వహిస్తామని తెలిపారు. గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తున్నామని..హైదరాబాద్ ప్రజాప్రతినిధుల తరుపున సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు చెబుతున్నాం అన్నారు.  70 ఏళ్ళ నుంచి పాలించిన వారు పాఠశాలను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. సమ్మక్క సారక్క వద్దకి వెళ్లి కేంద్రమంత్రి అబద్ధాలు చెప్పారన్నారు. సోమవారం విద్యాశాఖపై కేబినెట్ సబ్ కమిటీ సమవేశం నిర్వహిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

మరిన్ని వార్తల కోసం:

75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది

అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది