75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే

75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే

న్యూఢిల్లీ: ప్రతి విద్యార్థికి విద్యను అందించాలనేది రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేడ్కర్ కల అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశంలోని ప్రతి స్టూడెంట్ కు నాణ్యమైన విద్యను అందించాలనేది అంబేడ్కర్ స్వప్నమని.. కానీ ఆయన కోరిక నెరవేరలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, చాలా రాష్ట్రాల్లో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. అయితే అంబేడ్కర్ కలను తాము నిజం చేస్తున్నామని.. దేశ రాజధానిలో ఆయన స్వప్నాన్ని సాకారం చేశామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత ఏడేళ్లలో తమ ప్రభుత్వం ఢిల్లీలో 20 వేల క్లాస్ రూమ్స్  నిర్మించిందన్నారు.

కొన్ని రోజులుగా పలువురు రాజకీయ నేతలు తనను టెర్రరిస్టు అంటున్నారని.. ఇది తనకు నవ్వు తెప్పిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. ఎవరినైతే వారు ఉగ్రవాది అంటున్నారో.. ఆ వ్యక్తే ఇప్పుడు 12,430 క్లాస్ రూములను దేశానికి అంకితం చేస్తున్నారని చెప్పారు. ‘నాయకులు స్కూళ్లకు తప్ప దేనికీ భయపడరు. మంచి స్కూళ్లు ఉంటే.. కులం, మతం పేరుతో ఓట్లు గెలవడం నేతలకు కష్టతరం అవుతుంది. మంచి స్కూళ్లు సిసలైన దేశభక్తులను తయారు చేస్తాయి. అందుకే మేం ఫ్యాక్టరీల (స్కూళ్లు) ఏర్పాటుతో దేశభక్తులను రూపొందిస్తున్నాం’ అని కేజ్రీవాల్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది

అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది

ప్రభాస్ తో నటించడం నాకు దక్కిన గౌరవం