
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఆర్టీసీఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈదురు వెంకన్న ఎంపికయ్యారు. ఇప్పటివరకూ ఆ పదవిలో కొనసాగిన కే.రాజిరెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో సంఘం నేతలు ఆయనను ఆర్టీసీఈయూ జనరల్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించారు. దీనిపై రాజిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ లో చేరడానికి, ప్రధాన కార్యదర్శి పదవికి సంబంధం లేదని ప్రకటనలో తెలిపారు. మీటింగ్కు కోరం లేనందునా తన తొలగింపు నిర్ణయం చెల్లదని స్పష్టం చేశారు.