పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌పై ఢిల్లీ స్థాయిలో తన వంతు ప్రయత్నం చేస్తానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఏఐసీసీ నేత మధుయాష్కీ గౌడ్ తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటోన్మెంట్ బోర్డు విలీనం ప్రజల న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ ప్రాంతాల ఎంపీలతో కలిసి రక్షణ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు.
నామినేటెడ్ వ్యవస్థ రద్దు చేసి బోర్డును కార్పొరేషన్‌లో విలీనం చేస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. దీక్షకు టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, అన్ననగర్ ఆటో యూనియన్ నాయకులు, రసూల్‌పుర కస్తూర్బా స్కూల్ ఉపాధ్యాయులు
మద్దతు తెలిపారు.
