హైదరాబాద్, వెలుగు: గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కోడి గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిన్నటి వరకు రూ.4కు లభించిన ఒక గుడ్డు ప్రస్తుతం రిటైల్ దుకాణాల్లో రూ.7కు చేరింది. ఇరాన్, -అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కోడి గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో మార్చిలో గుడ్ల ధరలు భారీగా తగ్గాయి.
గత నెలలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గుడ్డు ధర రూ.4 నుంచి రూ.3.80 వరకు పడిపోయింది. ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర సుమారు రూ.5.25గా ఉండగా, రిటైల్ మార్కెట్‌లో అది రూ.7కు చేరింది.

