దండేపల్లి, వెలుగు : కుక్కల దాడిలో ఓ వృద్ధుడు చనిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... దండేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఓరుగంటి పోషం (80)కు భార్య గతంలోనే చనిపోగా, పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోషం మంచానికే పరిమితం అయ్యాడు.
గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇంట్లో పడుకున్న పోషంపై ఐదు కుక్కలు దాడి చేశాయి. బాధితుడి కేకలు విన్న స్థానికులు అక్కడికి వచ్చి కుక్కలను తరిమేశారు. అనంతరం 108కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి చూసే సరికే వృద్ధుడు చనిపోయి కనిపించాడు.
