
రాయపర్తి, వెలుగు : కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దురిశెట్టి మల్లమ్మ (76) మూడు రోజుల కింద స్నానం చేసేందుకు వేడి నీళ్లు తీసుకొని బాత్‌రూమ్‌లోకి వెళ్తుంది.
ఈ క్రమంలో అక్కడే ఉన్న కోతులు వృద్ధురాలిపై దాడి చేసి కరవడం, ఈ క్రమంలో ఆమె కింద పడిపోవడంతో వేడి నీళ్లు మీద పడి తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు తొర్రూరులోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి చనిపోయింది.