జూబ్లీహిల్స్ లో ముగిసిన ఎన్నికల కోడ్

 జూబ్లీహిల్స్ లో ముగిసిన ఎన్నికల కోడ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్లో అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల కోడ్ సోమవారం ఉదయంతో ముగిసింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన  నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఎత్తివేసినట్లు జిల్లా ఎలక్షన్​ ఆఫీసర్​ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 6న షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. 42 రోజుల పాటు అమల్లో ఉంది.