ఇవాళ్టి (సెప్టెంబర్29) నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలు

ఇవాళ్టి (సెప్టెంబర్29) నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలు

హైదరాబాద్​: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. సోమవారం( సెప్టెంబర్​29) స్థానికసంస్థల ఎన్నికలకు షెడ్యూల్​ రిలీజ్​ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్​  రిలీజ్​ చేసింది. ఐదు విడతలుగా ఎన్నికలు జరుగుతాయని తెలిపిన ఎస్ ఈసీ.. ఈ రోజునుంచి ఎన్నికల కోడ్​ అమలులోకి వస్తుందని తెలిపింది. 

తెలంగాణలో 31 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు  షెడ్యూల్​ రిలీజ్ అయింది.  రెండు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికలకు అక్టోబర్​ 9న నోటిఫికేషన్​ విడదల కానుంది. అదే రోజు నామినేషన్​ స్వీకరణ ప్రారంభం అవుతుంది. అక్టోబర్​ 17న నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్​ 31, నవంబర్​ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్​ నిర్వహిస్తారు. అదే రోజున సాయంత్రం ఫలితాలు విడుదల చేయనున్నారు. 

అక్టోంబర్​ 23న, 27న రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల పోలింగ్​ నిర్వహించునున్నారు.  ఫలితాలు నవంబర్​ 11న ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియ ముగుయనుంది.