ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి

ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వాహణపై ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల‌న్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిథర్ రెడ్డి. బుధ‌వారం గాంధీ భవన్ లో నిర్వ‌హించిన వర్చువల్ ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. పీసీసీ ఎలక్షన్ కమిటి కి సంబంధించిన కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింద‌ని, జీహెచ్ఎంసీ నాయకులు ప్రత్యేకంగా పాల్గొన్న ఈ వర్చువల్ మీటింగ్ లో.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై చర్చించామ‌ని అన్నారు.

జీహెచ్ఎంసీ లో వార్డుల పెంచుతారా..అలాగే ఉంచుతారా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు. వార్డుల పునర్విభజన ఎప్పుడు జరిగినా 2011జనాభా లెక్క ల ప్రకారమే జరగాలని చట్టం లోనే ఉంద‌ని అన్నారు. అధికార పార్టీ కి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకుంటున్నార‌ని శ‌శిథ‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. గతంలో జనాభా లెక్కలకు సంబంధం లేకుండా రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులు చేశార‌ని ఆరోపించారు. 2016లో నోటిఫికేషన్ కు కొన్ని గంటల ముందు రిజర్వేషన్ ప్రకటించారని అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ముందుగానే ప్రకటించాలని, రిజర్వేషన్లు ప్రకటన కు ముందు అభ్యంతరాలకు 15రోజుల సమయం ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు.

ఎన్నికల్లో బ్యాలెట్ ఉపయోగించాలా ..లేక ఈవిఎం ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అని ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని పార్టీల అభిప్రాయం కోరింద‌న్న మ‌ర్రి.. మ‌రో వైపు బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సిద్దమైనట్లువార్తలు వస్తున్నాయ‌ని అన్నారు. ఈ విష‌యంపై జీహెచ్ఎంసీ ఎన్నికల కమిషనర్ ను ,కొత్త ఎన్నికల అధికారి ని కలుస్తామ‌ని చెప్పారు. కోవిడ్ వల్ల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉందో..ఎన్నిక‌ల క‌మిష‌న్ దగ్గర ఉన్న సమాచారం త‌మ‌కు పంపించాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. ఎన్నికల నిర్వాహణపై ఎన్నిక‌ల క‌మిష‌న్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల‌న్నారు.

పోలింగ్ బూత్ లో 500మించి ఓటర్లు ఉండకుండా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ పనిచేయడం లేదన్నారు. హిందువులు ఎక్కువ ఉన్న చోట.. ముస్లిం లు ఎక్కువ మంది ఉండేలా గతంలో ఓట్లను చూపించారని అన్నారు. హౌస్ నెంబర్ ద్వారా ఓటర్ ఐడెంటి ఫై జరగాల‌న్నారు. 2015లో ఓటర్ల తొలగింపు పై తాము పోరాటం చేయడం తో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ను తొలగించారని మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డి గుర్తు చేశారు.