గురు పౌర్ణమి బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

గురు పౌర్ణమి బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్.. అక్కడికక్కడే వ్యక్తి  మృతి

హైదరాబాద్ కూకట్ పల్లిలోని  భాగ్యనగర్ కాలనీలో  విషాదం చోటుచేసుకుంది.  గురుపౌర్ణిమ సందర్భంగా టెంపుల్‌కు సంబంధించిన బానర్ కట్టేందుకు  కాలనీలోని కమాన్  ఎక్కి బానర్ కడుతుండగా కరెంట్ షాక్ తో  అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు.   

మంటలు అదుపుతప్పి పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌పైకి చేరడంతో భారీగా ఎగసిపడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైర్  ఇంజిన్లు  ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ALSO READ : మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటనలో అపశృతి.. కాన్వాయ్లో చెలరేగిన మంటలు..