మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటనలో అపశృతి.. కాన్వాయ్లో చెలరేగిన మంటలు..

మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటనలో  అపశృతి.. కాన్వాయ్లో చెలరేగిన మంటలు..

 మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సోమ్లా తండాలో హెలిప్యాడ్ వద్ద సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కాన్వాయ్ లోని ఒక వాహనంలో ప్రమాదం  చోటుచేసుకుంది. ఆన్ చేసి ఉన్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటం ఆందోళనకు గురి చేసింది.

మంగళవారం (జులై 08) మంత్రుల పర్యటనలో భాగంగా సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి వెళ్లారు. ఆయన కాన్వాయ్ లో మంటలు చెలరేగటంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనం నుంచి అందరినీ కిందికి దించారు.  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. తృటిలో పెనుప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు అధికారులు.

ALSO READ : నల్గొండ జిల్లాలో భూస‌మ‌స్యలకు ప‌రిష్కారం చూపాలి : పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా మహబూబాబాద్ పర్యటనలో ఉన్నారు మంత్రులు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖతో పాటు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి , ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్యటనలో ఉన్నారు. జిల్లాలో100 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు.