రికార్డు స్థాయిలో ఈ టూవీలర్ల అమ్మకాలు.. మే నెలలో 1.50 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లు

రికార్డు స్థాయిలో ఈ టూవీలర్ల అమ్మకాలు.. మే నెలలో 1.50 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లు

న్యూఢిల్లీ: పెట్రోల్‌‌‌‌, డీజిల్ ధరలు  నాలుగేళ్ల గరిష్టాలకు చేరడంతో ఈ ఏడాది మేలో ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు రికార్డ్ లెవెల్స్‌‌‌‌కు  చేరాయి. ఏప్రిల్‌‌‌‌తో పోలిస్తే  రెండు వేల యూనిట్లు పెరిగి 1,50,796 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.  టీవీఎస్ మోటార్ 41,558 బండ్లను అమ్మి ఈ–టూవీలర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో  లీడర్‌‌‌‌గా కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో 37,661 ఎలక్ట్రిక్ టూవీలర్లను అమ్మింది. బజాజ్ ఆటో అమ్మకాలు మే నెలలో  38,012 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏథర్  27,525 యూనిట్లను,  హీరో 18,261 యూనిట్లను విక్రయించాయి.