
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను స్పీడప్చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ డిమాండ్చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి శనివారం ఉప్పల్ లో ర్యాలీ నిర్వహించారు.
ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కేంద్రాన్ని ఒప్పించి రూ.600 కోట్ల నిధులతో ఫ్లై ఓవర్ శాంక్షన్ చేయించానని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డును వెడల్పు చేయించడంలో, బాధితులకు నష్ట పరిహారం చెల్లించడంలో విఫలమైందని మండిపడ్డారు.
ప్రస్తుత కాంగ్రెస్ప్రభుత్వం కూడా అదే తరహాలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ పనులను లేట్చేస్తోందన్నారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు పనులను వేగవంతం చేసి కారిడార్ పనులు పూర్తి చేయాలని కోరారు. బీజేపీ నాయకులు రేవు నరసింహ, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.