న్యూఢిల్లీ: గ్లోబల్ ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ గురువారం ఇండియాలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే మందు ‘టాన్‌స్ట్రైవ్’ ను లాంచ్ చేసింది. 'రీఅరేంజ్డ్ డ్యూరింగ్ ట్రాన్స్‌ఫెక్షన్' (ఆర్‌ఈటీ) జన్యు మార్పుల వల్ల వచ్చే క్యాన్సర్ గడ్డల చికిత్స కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి మార్కెటింగ్ అనుమతులు పొందింది.
రోగులు నోటి ద్వారా ఈ టాబ్లెట్లు వేసుకోవాలి. మార్కెట్లో ఇవి 40ఎంజీ, 80ఎంజీ, 120ఎంజీ, 160ఎంజీల సామర్థ్యాల్లో అందుబాటులో ఉంటాయి. ఒక బాక్స్ ధరను రూ. 2.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఒక్కో బాక్స్ కేవలం 14 రోజుల ట్రీట్‌మెంట్ కోర్సు (రెండు పూటల మోతాదు చొప్పున) కు మాత్రమే సరిపోతుంది.
