
ఎమర్జెన్సీ పొరపాటేనన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ టైమ్ లో జరిగిన ఘటనలు తప్పని రాహుల్ చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసుతో మాట్లాడారు రాహుల్. కానీ ఎమర్జెన్సీకి ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందన్నారు. అయితే కాంగ్రెస్ ఎప్పుడు కూడా రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నించలేదన్నారు. కాంగ్రెస్ కు ఆ శక్తి లేదని… పార్టీ వ్యవస్థ దానిని వ్యతిరేకిస్తుందన్నారు రాహుల్.