- ఎమోషనల్ ఈటింగ్.. ఇట్ల తగ్గిద్దాం
- ‘బోర్ కొడుతోంది.. ఏం చేద్దాం.. అట్ల పోయి
- ఓ చాయ్ సమోసా లాగిద్దాం..’
- ‘చాలా వర్క్ ఉంది.. పక్కన చిప్స్ ప్యాకెట్ పెట్టుకుందాం..’
ఇలా అనుకోవడం ఇప్పుడు చాలా కామన్. ఫుడ్ కూడా ఏదో టైం పాస్‌కి తినడం ఇప్పటి ట్రెండ్ అయిపోయింది. ఫలితంగా సైడ్ ఎఫెక్ట్స్.. దీన్నే ఎమోషనల్ ఈటింగ్ అంటున్నారు క్లినికల్ సైకాలజిస్ట్ దీక్షా అద్వానీ. ఏదో ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఫ్రిజ్ డోర్ తీస్తే ఆటోమెటిక్ గా చెయ్యి చాకోబార్ని అందుకుంటుంది. ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసే ముందైనా సరే, ఫ్రెండ్ ఎవరైనా పిజ్జా ఆఫర్ చేస్తే మొత్తం తినేయాల్సిందే. ఆకలుండదు. కానీ అలా తినడానికి అడిక్ట్ అవుతారు. ఒంటరిగా ఉండటాన్ని లైక్ చేసేవాళ్ళు ఇష్టమైన ఫుడ్‌ని చాలాసార్లు తింటారు. ఇలా తినడం వల్ల వాళ్లకు కొంచెం హ్యాపీనెస్ ఫీల్ అందుతుందట. ఏదో ఓదార్పు దొరుకుతున్నట్టు ఫీలవుతారు. అయితే తినడానికి ఒక టైం అంటూ ఫాలో అవ్వకపోవడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈ ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువయితే బరువు పెరగడం వంటి ప్రాబ్లమ్స్ ఎలాగూ వస్తాయి. కానీ.. ఎమోషనల్ ఈటింగ్ కి అసలు ఎలా అడిక్ట్ అవుతారు?
కారణాలివి
కొందరు వాళ్ల హ్యాబిట్స్ వల్ల ఎమోషనల్ ఈటింగ్‌కి అలవాటు పడతారు. రోజూ ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్తూ చాక్లెట్ తినడం ఈ రకమే. కొందరు ఐస్‌క్రీం తింటున్న పిల్లల్ని చూసి వాళ్ళూ కొనుక్కుని తింటారు. సిల్లీగా కనిపించే ఇలాంటి హ్యాబిట్స్ ఎమోషనల్ ఈటింగ్‌కు అడిక్ట్ అయ్యేలా చేస్తాయి. లైఫ్‌లో ఎక్కువ టైం మెంటల్ ప్రెజర్లోనే ఉంటున్నాం. బోర్ కొడితే సోషల్ మీడియాలో లాగిన్ కావడం. పనిలో పనిగా శ్నాక్ ఏదన్నా తినడం. ఇలా బోర్ ఫీలింగ్ కూడా ఎమోషనల్ ఈటింగ్‌కు ఫోకస్ అయ్యేలా చేస్తుంది. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెద్ద ట్రాప్. ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగేటప్పుడు పిజ్జాలు, బర్గర్లూ, కూల్‌డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయడం కష్టమై పోయింది. ఒకోసారి ఇష్టం లేక పోయినా ఫుడ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఒక రకమైన స్ర్టెస్ ఈటింగే. ఒకోసారి బాగా అలసి పోయిన ప్పుడు, ఏ ఇన్స్పిరేషన్ దొరకనప్పుడు కూర్చుని ఏది దొరికితే అది తింటుంటారు. ఆ మెంటల్ స్టేట్‌కి రికవరీ దొరికే వరకు ఎమోషనల్ ఈటింగ్ ఆగదు.
నెగెటివ్ ఫీలింగ్స్, ఎంప్టీనెస్, స్ట్రెస్.. ఇవన్నీ ఒక కంబైన్డ్ ప్యాకేజ్‌గా ఎమోషనల్ ఈటింగ్‌కు అలవాటు చేస్తాయి.
చెక్ చేసుకోవాలి..
- సడెన్‌గా స్పైసీ ఫుడ్ తినాలని అనిపించడం. వాటి కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం.
- టైం కాని టైంలో ఆకలి వేయడం. వంటగదిలో తినడానికి వెతకడం.
- చిన్న విషయాలకు ఆందోళన పడి ఆలోచిస్తూ ఏదో నమలడం. ఇష్టమైన ఫుడ్ మాత్రమే తినడం.
- తిన్న తర్వాత ఎక్కువ తినేశామని ఫీలవ్వడం.
- బాగా వెయిట్ పెరిగిపోయినట్టు గుర్తించడం.
ఇలా బయటపడాలి..
ఫుడ్ తినే విషయంలో కరెక్ట్ టైం ఫాలో అవ్వాలి. అవసరమైతే ఓ పేపర్ నోట్ రాసుకుని ఆకలి ఎప్పుడెప్పుడు అవుతుందో చెక్ చేసుకోవాలి. కోపంలో లేదా టెన్షన్ ఉన్నప్పుడు ఆకలేస్తుంటే.. గమనించి నోట్ చేయాలి. బోర్ కొట్టినప్పుడు వెంటనే ఫ్రెండ్‌కి కాల్ చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటే మంచిది. కథలు, కవితలు రాయడం, జాగింగ్, బుక్ రీడింగ్, యోగా వంటివి ఎమోషనల్ ఈటింగ్ నుంచి బయటపడేం దుకు బాగా హెల్ప్ అవుతాయి.
