ఉద్యోగుల జేఏసీ విరాళం రూ.48 కోట్లు

ఉద్యోగుల జేఏసీ విరాళం రూ.48 కోట్లు

హైదరాబాద్, వెలుగు: లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ నేపథ్యంలో సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఉద్యోగుల జేఏసీ సభ్యుల ఒక రోజు మూల వేతనం రూ.48 కోట్లను విరాళంగా ప్రకటించింది. మంత్రి శ్రీనివాస్‌‌‌‌గౌడ్ ఆధ్వర్యంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు చెక్కు అందజేశారు. పీఆర్టీయూ సభ్యులంతా తమ ఒకరోజు వేతనం రూ.16 కోట్లను విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్​ను పీఆర్టీయూ రాష్ర్ట​అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్​రెడ్డి, బీరెల్లి కమలాకర్​రావు మంగళవారం కేసీఆర్​కు అందజేశారు. వీరిద్దరూ తమ నెల వేతనం అందజేస్తూ మరో చెక్కును సీఎంకు అందించారు. మైక్రోసాఫ్ట్‌‌‌‌ సీఈఓ సత్య నాదెళ్ల భార్య అనుపమ వేణుగోపాల్‌‌‌‌ నాదెళ్ల రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. హీరో నితిన్  రూ.10 లక్షల చెక్కును కేసీఆర్ కు అందజేశారు. విజయ డెయిరీ తరఫున రూ.5లక్షలు అందజేయనున్నట్లు డెయిరీ చైర్మన్ లోకభూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు తెలిపారు.

ఎంపీ, ఎమ్మెల్యేలు…

నిజామాబాద్ జిల్లా కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తూ చెక్కును జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా రెండు నెలల జీతం, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఒక నెల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.5 లక్షలు అందజేస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రకటించారు.