Awarapan 2: ‘ఓజీ’ విలన్ కల్ట్‌‌ క్రైమ్‌‌ సీక్వెల్.. ఆవారపన్ 2 ఆరంభం.. హీరోయిన్గా ప్రభాస్ బ్యూటీ

Awarapan 2: ‘ఓజీ’ విలన్ కల్ట్‌‌ క్రైమ్‌‌ సీక్వెల్.. ఆవారపన్ 2 ఆరంభం.. హీరోయిన్గా ప్రభాస్ బ్యూటీ

ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్‌‌లో 2007లో వచ్చిన సినిమా ‘ఆవారాపన్‌‌’. మోహిత్ సూరి డైరెక్షన్‌‌లో వచ్చిన ఈ యాక్షన్‌‌ క్రైమ్‌‌ మూవీ ఇమ్రాన్‌‌ కెరీర్‌‌‌‌లో కల్ట్‌‌ క్లాసిక్‌‌గా నిలిచింది. శ్రియా శరణ్‌‌ ఇందులో హీరోయిన్. మృణాళిని శర్మ, అశుతోష్ రాణా కీలకపాత్రలు పోషించారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌‌ను స్టార్ట్‌‌ చేశారు.

సోమవారం ఈ మూవీ షూటింగ్‌‌ ప్రారంభమైంది. నితిన్‌‌ కక్కర్‌‌‌‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బిలాల్ సిద్ధిఖీ కథను అందిస్తున్నాడు. విశేష్ ఫిల్మ్స్‌‌ బ్యానర్‌‌‌‌పై విశేష్‌‌ భట్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం బ్యాంకాక్‌‌లో షూటింగ్‌‌ జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌‌ 3న సినిమా విడుదల కానుందని మేకర్స్‌‌ ప్రకటించారు. దిశా పటాని హీరోయిన్‌‌గా నటించబోతోందని తెలుస్తోంది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌‌ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

ఇక ఇటీవల పవన్  కళ్యాణ్‌‌ ‘ఓజీ’ సినిమాతో ఇమ్రాన్‌‌ హష్మీ టాలీవుడ్‌‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో విలన్‌‌గా ఆయన పోషించిన ఓమీ పాత్రకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

మరోవైపు ఈ ఏడాది హిందీలో ‘గ్రౌండ్‌‌ జీరో’ చిత్రంతో ఆకట్టుకున్న ఇమ్రాన్‌‌ హష్మీ... షారుఖ్‌‌ కొడుకు ఆర్యన్ ఖాన్‌‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ‘ది బ్యాడ్స్‌‌ ఆఫ్‌‌ బాలీవుడ్‌‌’ సిరీస్‌‌లోనూ కీలకపాత్రలో కనిపించారు.

ఇదిలా ఉండగా.. దిశా పటాని ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో దిశా పటాని రోల్కి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాగానే కలసి వచ్చింది. అయితే " కల్కి 2" లో మాత్రం దిశా పటానికి ఫుల్ లెంగ్త్ రోల్ ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.