జమ్మూకాశ్మీర్‎లో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూకాశ్మీర్‎లో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‎లోని కుల్గామ్‌‌ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌‌ కౌంటర్‌‌లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు. ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి. కుల్గామ్‎లోని గుదార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కొన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్‌‌ ఆపరేషన్‌‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన టెర్రరిస్టులు వారిపై కాల్పులు జరిపారు. 

దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని శ్రీనగర్‌‌కు చెందిన చినార్ కోర్ ఆఫ్ ఆర్మీ తెలిపింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని చెప్పింది. జూనియర్ కమిషన్డ్ అధికారితో సహా ముగ్గురికి గాయాలయ్యాయని పేర్కొంది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని ఆర్మీ వెల్లడించింది.