కేరళలో తీవ్ర పేదరికం అంతం: మంత్రి రాజేశ్ప్రకటన

కేరళలో తీవ్ర పేదరికం అంతం: మంత్రి రాజేశ్ప్రకటన

తిరువనంతపురం: కేరళలో తీవ్రమైన పేదరికాన్ని రూపుమాపినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్ర స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంబీ రాజేశ్​శనివారం అధికారికంగా ఈ విషయం మీడియాకు వెల్లడించారు. ఆహారం, ఇల్లు, బట్టలు, వైద్యం, కనీస ఆదాయం లేకపోవడాన్ని తీవ్రమైన పేదరికంగా తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. అత్యంత పేదకుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాలకు ఈ వసతులను కల్పించినట్టు తెలిపారు. అయితే ఇది ఒక్క రోజులో జరిగిన పనికాదన్నారు. పారదర్శకమైన, భాగస్వామ్య ప్రక్రియతో అమలు చేసిన ‘తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం’ (ఈపీఈపీ) ద్వారా ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.