మొదలైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

మొదలైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: బీటెక్, బీఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈఏపీ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు 56,675 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 

వారంతా ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ నెల12 వరకు విద్యార్థులు ఆన్​లైన్​రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 8 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. మరిన్ని వివరాల కోసం  https://tgeapcet.nic.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ చూడాలని సూచించారు.