ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లోనే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌.. రాబోయే మూడు మెగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ అక్కడే !

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లోనే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌.. రాబోయే మూడు మెగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ అక్కడే !

సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వరల్డ్ టెస్ట్ చాంపియప్‌‌‌‌‌‌‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదికను ఐసీసీ మార్చలేదు. గత మూడు ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ను విజయవంతంగా నిర్వహించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కే రాబోయే మూడు మెగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ ఆతిథ్య హక్కులను కేటాయించింది. ఈ మేరకు ఆదివారం ముగిసిన ఏజీఎంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 2027, 2029, 2031లో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ జరుగుతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం, టెస్ట్ క్రికెట్‌‌‌‌‌‌‌‌పై ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ అభిమానుల ఆసక్తిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది.

ఇండియాలో ఫైనల్స్ నిర్వహించాలని బీసీసీఐ నుంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ ఐసీసీ ఇంగ్లండ్ బోర్డుకే ఓటు వేసింది. ఇక, టిమోర్ లెస్ట్, జాంబియా  దేశాలు ఐసీసీలో అసోసియేట్ సభ్యులుగా చేరాయి. దీంతో మొత్తం మెంబర్ల సంఖ్య 110కి చేరింది. పాలనాపరమైన సంస్కరణలు చేపట్టేందుకు యూఎస్ఏ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు ఐసీసీ మూడు నెలల అదనపు గడువు ఇచ్చింది. ఈ కాలంలో ఎన్నికలు నిర్వహించడంతో పాటు అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించింది.

ఇక,  ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ)లో కొత్త అసోసియేట్ సభ్యుల ప్రతినిధులుగా గురుమూర్తి పాలాని (ఫ్రాన్స్), అనురాగ్ భట్నాగర్ (హాంగ్‌‌‌‌‌‌‌‌కాంగ్), గుర్దీప్ క్లయిర్ (కెనడా) ఎన్నికయ్యారు. ఇక, అఫ్గానిస్తాన్ విమెన్ క్రికెటర్లకు ఐసీసీ మద్దతు ప్రకటించింది. తాలిబాన్ పాలన కారణంగా ఆటకు దూరమైన అఫ్గాన్ అమ్మాయిలకు మళ్లీ ఆడే అవకాశం ఇస్తుంది. ఇందులో భాగంగా ఈ  ఏడాది విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌, 2026 టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర ప్రధాన టోర్నమెంట్లలో వారికి భాగస్వామ్యం కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని బీసీసీఐ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల సహకారంతో ఐసీసీ అమలు చేస్తుంది.