26 రన్స్‌‌ తేడాతో ఓడిన పాకిస్తాన్‌‌

 26 రన్స్‌‌ తేడాతో ఓడిన పాకిస్తాన్‌‌

ముల్తాన్‌‌: పాకిస్తాన్‌‌ టూర్‌‌లో ఇంగ్లండ్‌‌ సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేస్తోంది. వరుసగా రెండో టెస్టులో పాక్‌‌ను ఓడించింది. నాలుగో రోజు, సోమవారం ముగిసి రెండో మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌ 26 రన్స్‌‌ తేడాతో అద్భుత విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌‌ను ఇప్పటికే 2–0 సొంతం చేసుకుంది. 355 టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 198/4తో ఆట కొనసాగించిన పాక్‌‌ 328 రన్స్‌‌కు ఆలౌటై కొద్దిలో విజయాన్ని చేజార్చుకుంది. సౌద్‌‌ షకీల్‌‌ (94), ఇమాముల్‌‌ హక్ (60), మొహమ్మద్‌‌ నవాజ్ (45) పోరాడినా మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఇంగ్లండ్‌‌ బౌలర్లలో మార్క్‌‌ వుడ్‌‌ (4/65) పాక్‌‌ను దెబ్బకొట్టాడు. హ్యారీ బ్రూక్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.