తొలి కప్‌ కోసం ఇంగ్లండ్‌ అలుపెరగని వేట

తొలి కప్‌ కోసం ఇంగ్లండ్‌ అలుపెరగని వేట
  •  పటిష్టమైన జట్టు తో బరిలోకి..
  • సొంతగడ్డ అనుకూలత కలిసొచ్చేనా?

44 ఏళ్లు గా పోరాటం చేస్తు న్నా.. ఒక్కసారి కూడా కప్‌ కొట్టలేని చరిత్ర. 11 సార్లు బరిలోకి దిగినా..కప్‌ అందించే ఆటగాడు దొరకని అవస్థ. 4 సార్లు ఆతిథ్యమిచ్చినా.. సొంతగడ్డ అనుకూలతను ఒడిసిపట్టుకోలేకపోయిన దురావస్థ. క్రికెట్‌ కు పుట్టినిల్లే అయినా.. కలల కప్‌ ను అందుకోవడంలో ఎప్పుడూ వెనుకంజే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది లెజెండ్స్‌వచ్చారు.. ప్రయత్నించారు .. పోరాడారు..విఫలమయ్యారు.. అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదో ఓ కారణంతో వెనకబడిపోయిన ఇంగ్లిష్‌ జట్టు .. మూడుసార్లు రన్నరప్‌ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోమరోసారి తమ పుట్టింటికి వచ్చిన వరల్డ్‌‌కప్‌ ను ఈసారైనా ఒడిసిపట్టుకుంటుందా.. ! మహామహా మొనగాళ్లతో రాటుదేలిన మేటి జట్టు గా.. ఫేవరెట్‌ హోదాతో బరిలోకి దిగుతున్నఇంగ్లండ్‌‌… కొత్త చరిత్రకు ప్రాణం పోస్తుందా..! పాత చరిత్రను పునరావృతం చేస్తుందా అన్నది ఆసక్తికరం.

‘ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ సాధ్యం కాదేమో!’..వరల్డ్‌‌కప్‌ వేట కోసం బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌ కు ఈ టైటిల్‌ బాగా సరిపోతుం ది. ఈ మాట చెప్పడానికి ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఉన్న ఫామ్‌ కూడా ఓ కారణం.తుది 11 మందిలో ఉండే ఆటగాళ్లకు ఇంగ్లిష్‌ పిచ్‌ లు కొట్టిన పిండి. నీళ్లు తాగి నంత సులువుగా భారీ స్కోర్లు చేయడమే కాదు.. ఛేదిస్తారు కూడా.

ఇటీవల పాక్‌ తో జరిగిన సిరీసే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. ఇందులో ఐదు మ్యాచ్‌ లు జరిగితే నాలుగుసార్లు 300 ప్లస్‌ రన్స్‌‌ చేశారు. మూడో వన్డేలో అయితే 359 పరుగుల టార్గెట్‌ ను మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే ఉఫ్‌ మని ఊదేశారు. ఈ ఒక్క మ్యాచ్‌ చాలు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌‌మెన్‌ ఎంత ఫామ్‌ లో ఉన్నా రో చెప్పడానికి. అవసరమైతే ఒకటి నుం చి పది వరకు బ్యాటింగ్‌‌ చేసే ఆటగాళ్లకు కొదువలేదు. రిజర్వ్‌‌ బెంచ్‌ కూడా బలంగానే ఉంది. వివాదాలతో ఒకరిద్దరు ఆటగాళ్లు ఈ మెగా ఈవెం ట్‌ కు మిస్సయినా.. ఇప్పుడున్న జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. ఇప్పుడున్న బ్యాటింగ్‌‌ బలం.. గతంలో ఎన్నడూ లేదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. వీళ్లందరూ సమష్టిగా చెలరేగితే.. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థి అయినా మట్టి కరువాల్సిందే. అయితే నాకౌట్‌ మ్యాచ్‌ ల్లో ఒత్తిడిని అధిగమించలేకపోవడం వీళ్లను భయపెడుతున్న అతిపెద్ద బలహీనత. దీనిని అధిగమించాలి. 2011లో ఆతిథ్య హోదాలో ఇండియా కప్‌ గెలిచిం ది. 2015లో ఆసీస్‌ దానిని కొనసాగించిం ది. ఈ సెంటిమెంట్‌ వర్కౌ ట్‌ అయితే ఈసారి ఇంగ్లండ్‌ కప్‌ కొట్టడం ఖాయమే..!

ప్రతికూలతలు

బహిరంగంగా చర్చించే బలహీనతలు లేకపోయినా..పేస్‌ అటాక్‌ లోనే కాస్త బలం తగ్గిం ది. అందుకే ఇటీవల పాక్‌ తో జరిగిన ప్రతి మ్యాచ్‌ లో 300లకు పైగా రన్స్‌‌ సమర్పించుకున్నారు . భారీ టార్గెట్లను ఛేదించాల్సి రావడం కూడా బ్యాట్స్‌‌మెన్‌ పై ఒత్తిడి పెంచుతున్నది.ఆర్చర్‌ రాకతో తుది కూర్పులో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రతి మ్యాచ్‌ లో దూకుడుగా ఆడే ప్రయత్నం అన్ని వేళలో కలిసి రాకపోవచ్చు. 2017 చాంపియన్స్‌‌ ట్రోఫీ, ఇటీవల విండీస్‌ తో జరిగిన సిరీస్‌ లే ఇందుకు ఉదాహరణ. సొంతగడ్డపై ఒత్తిడిఎక్కువగా ఉండటం కూడా ప్రతికూలాం శమే. ఒక్కోసారి నిలకడ లేమితో ఇబ్బందిపడటం ఇంగ్లిష్‌ జట్టును దెబ్బతీస్తున్నది. ఓ రోజు బాగా ఆడిన జట్టే.. తర్వాతి రోజు చేతులెత్తేస్తున్నది. సెమీస్‌ , ఫైనల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కోలుకోవడం కష్టం .

ఫ్లాట్‌ పిచ్‌ లపై స్పిన్నర్లు ఎంతమేరకు ప్రభావం చూపుతారో చూడాలి. ఔట్‌ ఫీల్డ్‌‌ వేగంగా ఉండే గ్రౌండ్స్‌‌ల్లో ఆల్‌ రౌండర్లను నమ్ముకోవడం కత్తిమీద సామే. పాక్‌ తో జరిగిన సిరీస్‌ లో భారీ స్కోర్లు నమోదు కావడానికి కూడా ఇదో కారణం. ఇంగ్లండ్‌ , ఆసీస్‌ , సౌతాఫ్రికాలాంటి జట్లపై ఆడినప్పుడు ఈ వ్యూహం పని చేయకపోవచ్చు. గ్రూప్‌ దశలో ఆడినట్లు నాకౌట్‌ లో ఆడకపోవడం ఇంగ్లండ్‌ కు ఎప్పట్నించో వస్తున్న అలవాటు. ఆర్చర్‌అనుభవలేమి కూడా బలహీనతగా మారే అవకాశాన్ని తీసిపారేయలేం . మోర్గా న్‌ , ఆర్చర్‌ , ఆదిల్‌ రషీద్‌ ,మార్క్‌‌వుడ్‌ గాయాలు కూడా జట్టును ఆందోళనపరుస్తున్నా యి.

అనుకూలతలు..

ఒకప్పుడు సంప్రదాయ పద్ధతిలో బ్యాటింగ్‌‌ చేసే ఇంగ్లండ్‌ ఇప్పుడు పంథా మార్చుకుంది. 2015లో గ్రూప్‌ దశలో ఎదురైన ఓటమి జట్టు దృక్పథాన్నే మార్చేసింది. ప్రస్తుత టీమ్‌దూకుడుకు పర్యాయపదంగా మారిపోయింది. దీనికితోడు ఇంగ్లిష్‌ ఫ్లాట్‌ పిచ్‌ లు వీళ్ల బ్యాటింగ్‌‌కు అతికినట్లు సరిపోతున్నాయి. జట్టులోఉన్న నాణ్యమైన హిట్టర్లు.. టీమ్‌ ఫెర్ఫామెన్స్‌‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు . ఇప్పుడున్న పరిస్థితుల్లో 350 టార్గెట్‌ కూడా వాళ్లకు చిన్నదిగానే కనిపిస్తున్నది. జేసన్‌ రాయ్‌ , బట్లర్‌ , మోర్గాన్‌ ,రూట్‌ వంటి ఆటగాళ్లు ఇన్నింగ్స్‌‌కు వెన్నెముకగా నిలుస్తున్నారు . కీలక సమయంలో యాంకర్‌ ఇన్నింగ్స్‌‌తో వీళ్లు నిలకడనూ తెస్తున్నారు . టాప్‌ఆర్డర్‌ ను పక్కనబెడితే.. జట్టులో ఆల్‌ రౌండర్లకు కూడా కొదువలేదు. లోయర్‌ ఆర్డర్‌ లో వచ్చేబౌలర్లు కూడా బ్యాట్‌ తో దుమ్ములేపుతున్నారు .ఆదిల్‌ రషీద్‌ , ఫ్లంకెట్‌ , కరన్‌ , ఆర్చర్‌ , వోక్స్‌‌ కూడా విలువైన రన్స్‌‌ చేయడం లాభించే అంశం.వీళ్లు టాప్‌ ఆర్డర్‌ స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని కల్పిస్తున్నారు . కాబట్టే మూడొందల స్కోరును కూడా అలవోకగా ఛేదిస్తున్నారు . పరిస్థితులు ఎలా ఉన్నా కుదురుకున్నారంటే మాత్రం పరుగుల వరద పారాల్సిందే.

గతంతో పోలిస్తే కప్‌ గెలిపిం చే ఆటగాళ్ల సంఖ్య కూడా డబుల్‌ అయ్యిం ది.దీనికితోడు సొంత గడ్డ అనుకూలత ఎలాగూ ఉండనే ఉంది. టీమ్‌ లో ఉన్న ప్రతి ఒక్కరు సూపర్‌ఫామ్‌ లో ఉన్నారు . టెయిలెండర్ల బలం కూడా జట్టుకు కలిసొచ్చే అంశం. నాణ్యమైన మణికట్టు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు . వ్యక్తిగతంగా చూస్తే ఆర్చర్‌ .. ట్రంప్‌ కార్డు. పేస్‌ అటాక్‌ భారీగా రన్స్‌‌ ఇస్తున్నా .. ఆర్చర్‌ రాకతో బౌలింగ్‌‌లో డెప్త్‌‌,బలం పెరిగింది. ఇంగ్లిష్‌ గడ్డపై ఆడిన మేటి ప్రత్య-ర్థులపై రషీద్‌ బాగా సక్సెస్‌ అయ్యాడు. 2018లో ఇండియాతో జరిగిన సిరీస్‌ లో అతను మిడిల్‌ఓవర్లలో చాలా ప్రభావం చూపెట్టాడు. మిడిల్‌ ఓవర్లలో రషీద్‌ వికెట్లు తీస్తే ఈ టోర్నీలో ఇంగ్లండ్‌సక్సెస్‌ అయ్యినట్లే.